- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీ మెట్రో రైలు ఎండీగా మళ్లీ ఆయనే.. ఉత్తర్వులు జారీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకమయ్యారు. ఆయన గతంలో మెట్రో రైలు ఎండీగానే పని చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎండీ పదవికి రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2014లో రామకృష్ణారెడ్డిని టీడీపీ ప్రభుత్వం మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా నియమించారు. దీంతో రామకృష్ణారెడ్డినే డీపీఆర్‌లు రెడీ చేశారు. అనూహ్యంగా 2019లో ప్రభుత్వం మారింది. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టారు. 2021 వరకూ మెట్రో రైలు పట్టాలెక్కలేదు. అయితే పోర్టులపై రామకృష్ణారెడ్డికి ఉన్న అనుభవం దృష్ట్యా మారిటైమ్ బోర్డుకు సీఈవోగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.. కానీ రామకృష్ణారెడ్డిపై మరొకరిని అధికారిగా నియమించారు. దీంతో రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో రామకృష్ణారెడ్డినే మెట్రో రైలు ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి రామకృష్ణారెడ్డి టీడీపీ ప్రభుత్వంలోనే పదవీ విరమణ చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లు పొడిగించింది. అటు జగన్ ప్రభుత్వం కూడా ఆయన పదవీకాలన్ని పొడిగించింది. కానీ కొన్ని కారణాల వల్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.