అన్నవరం దేవస్థానం ఈవో బదిలీ

by Seetharam |   ( Updated:2023-11-16 07:15:18.0  )
అన్నవరం దేవస్థానం ఈవో బదిలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ బదిలీ అయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రభుత్వం శ్రీకాళహస్తికి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే అన్నవరం ఆలయ ఈవోగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కే రామచంద్ర మోహన్‌ను డిప్యుటేషన్‌పై ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలను చూస్తున్న కేవీ సాగర్ బాబును ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా కొనసాగాలని ఆదేశించింది. ఇకపోతే దేవాదాయ కమిషనరేట్‌లో సంయుక్త కమిషనర్‌గా ఉన్న ఆజాద్‌కు ఈ ఏడాది మార్చిలో అన్నవరం ఆలయ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గత నెలలో ఆయనకు ఈవోగా పోస్టింగ్‌ ఇచ్చారు. అనంతరం ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు వివాదాలకు కారణమయ్యాయి. దీంతో ఆయనను బదిలీ చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఇన్‌చార్జిఈవోగా ప్రభుత్వం నియమించిన కే రామచంద్రమోహన్ 13ఏళ్ల క్రితం ఇదే ఆలయానికి ఈవోగా పనిచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story