బాబాయ్ కోసం పిఠాపురానికి రామ్ చరణ్, సురేఖ.. సడన్‌గా పర్యటన ఖరారు

by GSrikanth |
బాబాయ్ కోసం పిఠాపురానికి రామ్ చరణ్, సురేఖ.. సడన్‌గా పర్యటన ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయన గెలుపు కోసం టాలీవుడ్ నుంచి అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, జబర్తస్త్ నటులు స్వయంగా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటికే వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయితేజ్ వంటి హీరోలు ప్రచారం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం పంపించగా.. రామ్ చరణ్, అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. అయితే రేపు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తల్లి సురేఖతో కలిసి ప్రచారం చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వెళుతున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి రాంచరణ్, సురేఖలు పిఠాపురం వెళుతున్నారు. పిఠాపురంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. అంతేకాదు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రచారం చేయనున్నారు. ముగిసిన తర్వాత వారు పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం ఉంది. మరోవైపు రామ్ చరణ్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story