- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఏలూరులోనూ వాన పడుతోంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ పలుచోట్ల వాన కురిసింది. రాజమండ్రిలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శ్రీశైలంలో కురిసన వర్షానికి భక్తులు వసతి గృహాల్లోనే ఉండిపోయారు. అయితే రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డుపై వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో చెరువులు, వాగులు, వంకలకు భారీగా నీరు చేరుతోంది. ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది. ఇక ఈరోజు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. భాగ్యనగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.