విజయవాడలో వర్షం బీభత్సం.. కొండరాయి పడి ఇల్లు ధ్వంసం

by srinivas |   ( Updated:2024-07-20 05:12:20.0  )
విజయవాడలో వర్షం బీభత్సం.. కొండరాయి పడి ఇల్లు ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్లు ప్రాంతాలన్ని నీట మునిగాయి.వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. విద్యాధరపురం కోటయ్య వీధి కొండ ప్రాంతాంలో భారీ ప్రమాదం తప్పింది. కొండరాయి జారి పడి ఇల్లు ధ్వంసం అయింది. ఈ ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. 20 ఏళ్లుగా కొండ ప్రాంతంలో నివాసిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని బాధితురాలు తెలిపారు. పెద్ద కొండచరియ జారీ పడిందని, ఇంట్లో తాను మాత్రమే ఉన్నానని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని బాధితురాలు పేర్కొన్నారు.

విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ధ్వంసమైన ఇంటి శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లొద్దన్నారు. చెట్ల కింద నిల్చొవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో అటు స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed