Amaravati: అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధాని మోడీకీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

by Mahesh |
Amaravati: అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధాని మోడీకీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో జరిగింది. ఇందులో ఏపీ రాజధాని అమరావతి రైల్వే లైన్‌(Railway line to Amaravati.)కు కేబినెట్(Cabinet) ఆమోదం తెలిపింది. గంటూరు జిల్లా ఎర్రుపాలెం(Yerrupalem) నుంచి అమరావతి మీదుగా నంబూరు(Nambur) వరకు కొత్త రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. రూ. 2,245 కోట్లు విడుదల కు ఆమోదం తెలిపింది. కృష్ణా నది(Krishna river)పై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ నగరాలతోఈ రైల్వే లైన్ అనుసంధానం కానున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు ప్రకటించారు.

కాగా అమరావతి రైల్వే లైన్‌ కు కేంద్రం ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు నాయుడు(CM chandrababu ) స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్చువల్ గా సీఎం చంద్రబాబాబు కేంద్ర మంత్రితో మాట్లాడుతూ.. ఈ రైల్వే లైన్‌తో దేశంలోని అన్ని నగరాలకు అమరావతి కనెక్ట్‌ అవుతుంది.. నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తవుతుంది. మూడేళ్లలో పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరం. భూసేకరణకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నాను. వచ్చే నెలలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానిస్తున్నాము అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed