భార్యతో గొడవలు..మద్యం మత్తులో నాటు బాంబు కొరికిన భర్త

by Seetharam |
భార్యతో గొడవలు..మద్యం మత్తులో నాటు బాంబు కొరికిన భర్త
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లైన కొన్నాళ్లపాటు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా బతికారు. అనంతరం దంపతుల మధ్య కలహాలు మెుదలయ్యాయి. నిత్యం గొడవలతో ఆ దంపతులు సతమతమవుతున్నారు. దీంతో భర్త మద్యానికి బానిసగా మారాడు. భార్యతో గొడవపడిన ఆ భర్త మద్యం మత్తులో నాటు బాంబు కొరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి, భార్యతో కలిసి జీవిస్తున్నాడు. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య భర్తతో వేగలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి చిరంజీవి పీకలదాకా తాగాడు. ఇంటికి వచ్చాడు.మద్యం మత్తులో నాటు బాంబును నోటితో కొరికాడు. అది పేలడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story