పురంధేశ్వరి! మీ మరిది అవినీతిపరుడు...నేరస్థుడు: ఎంపీ విజయసాయిరెడ్డి

by Seetharam |   ( Updated:2023-10-12 11:21:23.0  )
పురంధేశ్వరి! మీ మరిది అవినీతిపరుడు...నేరస్థుడు: ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం ఉన్నారు. అమిత్ షాతో లోకేశ్ భేటీ సందర్భంగా పురంధేశ్వరి ఉండటంపై వైసీపీ సెటైర్లు వేస్తోంది. ట్విటర్ వేదికగా ఈ భేటీపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. మీ మరిది చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని పురంధేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.‘అమ్మా పురంధేశ్వరి... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు.నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు.13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఒక ఫేక్‌ అగ్రిమెంట్‌తో స్కిల్‌ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్‌ అని సీమెన్స్‌ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఆ అగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది. ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్‌మెంట్‌లో చెప్పింది. సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా ఎలా రూట్‌ చేశారో స్వయంగా బాబు పీఏ వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా రూ. 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తరవాత షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed