- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Purandeshwari: డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలి.. జగన్‌పై పురందేశ్వరి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నానంటూ మాజీ సీఎం జగన్ (Former CM Jagan) చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై బీజేపీ (BJP) నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తుల మనోభావాలతో ఆటలాడిన వైసీపీ ప్రభుత్వం, తిరుమల ప్రవిత్రతను దెబ్బతీసిన జగన్ మళ్లీ తిరుమల (Tirumala)కు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించేందుకు అందరికీ అనుమతి ఉంటుందని తెలిపారు.
కానీ, మాజీ సీఎం జగన్ ముందుగా టీటీడీ అధికారులకు డిక్లరేషన్ (Declaration) సమర్పించిన తరువాతే శ్రీవారిని దర్శించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వి్ట్టర్ (Twitter)లో డిక్లరేషన్ ఫామ్‌ను కూడా ట్వీట్ చేశారు. కాగా, లడ్డూ వివాదం నేపథ్యంలో ఈనెల 28న మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నట్లుగా ప్రకటించిన సంగతి విదితమే. తిరుమల పవిత్రను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని చంద్రబాబు (Chandrababu) చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తిరుమలకు కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నట్లుగా జగన్ ప్రకటించారు.