జీవీఎల్ vs పురందేశ్వరి.. AP బీజేపీలో కొత్త పంచాయతీ..!

by Satheesh |   ( Updated:2023-02-17 09:56:49.0  )
జీవీఎల్ vs పురందేశ్వరి.. AP బీజేపీలో కొత్త పంచాయతీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీలో కొత్త పంచాయతీ నెలకొంది. జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్ పేర్లు పెట్టడాన్ని తప్పుబట్టిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు దగ్గుబాటి పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. అన్ని పథకాలకు ఆ ఇద్దరి పేర్లేనా.. ఇంకేవరు లేరా అన్నా జీవీఎల్ వ్యాఖ్యలపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అని ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తీసుకురావడంతో పాటు.. రూ. 2 కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళ విశ్వవిద్యాలయం ఇలా పేదలకు సేవలు అందించారన్నారు.

దివంగత సీఎం వైఎస్ ఫీజు రియింబర్స్‌మెంట్, 108 సేవలు, ఆరోగ్య శ్రీని తీసుకువచ్చారని పురందేశ్వరి గుర్తు చేశారు. కాగా.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన మరుసటి రోజే.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక నేతలు బహిరంగ విమర్శలతో వార్తల్లోకెక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నా వ్యవహారం చల్లారకముందే.. ఏపీ బీజేపీలో జీవీఎల్ వర్సెస్ పురందేశ్వరిగా రాజకీయం మారింది.

ఇవి కూడా చదవండి: కేసీఆర్ భారీ స్కెచ్.. ఏపీ కీలక నేతపై సీఎం కన్ను..!

Advertisement

Next Story

Most Viewed