మాగోడు వినండి: Ambati Rayudu కు నిరసన సెగ

by Seetharam |   ( Updated:2023-07-31 16:05:36.0  )
మాగోడు వినండి: Ambati Rayudu కు నిరసన సెగ
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు నిరసన సెగ తగిలింది. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు రాబోయే రోజుల్లో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణాడెల్టా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు లోక్‌సభ పరిధిలో అంబటి రాయుడు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్‌పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందంటున్న అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాను అనేది ఇప్పుడే చెప్పలేనని అంటున్నారు. అయితే సోమవారం అంబటి రాయుడు వెలగపూడి చేరుకున్నారు. వెలగపూడిలోని శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబటి రాయుడును చూసిన అమరావతి రాజధాని రైతులు ఆయన వద్దకు వెళ్లారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల ఆవేదనను వినాలని కోరారు. అయితే అంబటి రాయుడు టైం లేదని చెప్పుకొచ్చారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదని కనీసం తమ బాధలు వినాలని కోరారు. అయితే మరోసారి వింటానని అంబటి రాయుడు అక్కడ నుంచి వెనుదిరిగారు. దీంతో అంబటి రాయుడుపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి Andhra Pradesh News: ఆచంట YCP లో మంట.. దూసుకుపోతున్న TDP Incharge

Advertisement

Next Story