- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగనన్న లే ఔట్లకే ప్రిఫరెన్స్.. కలగా సొంతిల్లు..!
జగనన్న గృహ నిర్మాణ పథకం ఉన్నా, సక్రమంగా అమలు జరగడం లేదు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నిర్మాణాలు మొదలుపెట్టిన వారు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ అందక అప్పులపాలయ్యారు. ప్రభుత్వ కేవలం జగన్న లేఔట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ, సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటామంటే ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు అర్జీలు తీసుకున్న తరువాత స్పందిండం లేదంటూ మండిపడుతున్నారు.
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి : ఉమ్మడి గోదావరి జిల్లాలో జగనన్న గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటామని దాదాపు లక్షల్లో అర్జీలు అందాయి. ప్రతి మండలంలోనూ దాదాపుగా వెయ్యి మందికి పైగా ఇంటిని కట్టుకోవడానికి సిద్దంగా ఉన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు అమల్లోకి తీసుకువచ్చిన జగనన్న గృహ నిర్మాణ పథకంలో దరఖాస్తు చేసుకుంటే ఇంటి నిర్మాణ దశను బట్టి నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు దరఖాస్తుదారులు అనుమతులు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగుతున్నారు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు. గత వారం క్రితం అర్జీలు ముమ్మరంగా తీసుకున్నారు. తీరా పంచాయతీలో మాత్రం బేసిమెంటు లెవల్ కు లాగిన్ క్లోజ్ చేశారు. ఫలితంగా అర్జీ దారులు చాలా చోట్ల నిర్మాణాలు నిలిపివేసి తదుపరి అనుమతుల కోసం వేచి చూడాల్సి వస్తుంది.
జగనన్న కాలనీలకేనా..
గృహ నిర్మాణం పథకం నుంచి జగనన్న కాలనీలకు మాత్రమే పథకం వర్తింపజేస్తున్నారు. ప్రతి గ్రామంలో కాలనీలు కడుతున్నారు. రూ.1.80 వేల వరకు ప్రభుత్వం సబ్సడీగా అందజేస్తుంది. ఇవి తిరిగి చెల్లించే పని లేదు. ఈ బాధ్యతలను పంచాయతీ కార్యాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంటుకు అప్పగించి ఎప్పటికప్పుడు దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చేస్తున్నారు. అధికారులు పరిశీలించిన అనంతరం సంబంధిత లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమచేస్తున్నారు. కొన్నిచోట్ల గుత్తే దారులు కూడా ఇళ్లు కట్టి ఇస్తున్నారు.
సర్వేలో వ్యతిరేకత
ఇళ్ల నిర్మాణ విషయమై గోదావరి జిల్లాలో ఇటీవల సర్వే చేశారు. సదరు సర్వేలో సొంత స్థలాల వారికి అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జగనన్న కాలనీ లబ్ధిదారులకు కొందరు పార్టీకి అనుకూలంగా ఉన్నా, సొంత స్థలాల వారు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల రాబోవు ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. స్వయాన రాష్ర్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దువులూరి దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఉండటం మరీ దారుణం. ప్రభుత్వం స్పందించాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.
Also Read..