Prakasam: చెట్టుపై పిడుగు...ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

by srinivas |
Prakasam: చెట్టుపై పిడుగు...ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
X

దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గొల్లవిడిపి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు రైతు పోలు వెంకటేశ్వర్లు మృతి చెందారు, మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వర్షం పడుతుందని చెట్టు కిందికి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story