Darshi : Nara Lokeshకు గాయాలు

by srinivas |   ( Updated:2023-07-31 17:13:36.0  )
Darshi : Nara Lokeshకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. అయితే పాదయాత్రలో జనం ఒక్కసారిగా లోకేశ్‌పై పడ్డారు. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లోకేశ్‌ను కిందపడకుండా పట్టుకున్నారు. ఈ ఘటనలో లోకేశ్ చేతులకు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌కు భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు.

Advertisement

Next Story