- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ వెళ్తారా..?... వెళ్లరా..?
దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Directer Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్(Maddipadu Police Station)లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)తో పాటు పలువురిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో జనసేన(Janasena), టీడీపీ(Tdp) నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్‌గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒంగోలు పోలీస్ స్టేషన్(Ongolu Police Station)లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ కేసును క్వాష్ చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ విచారణకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి రామ్ గోపాల్ వర్మ ఈ రోజు జరిగే విచారణకు వెళ్తారా..?, వెళ్లరా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక విచారణకు సంబంధించి పోలీసులకు రామ్ గోపాల్ వర్మ తరపున లాయర్లు ఎలాంటి సమాచారం అందించారనేదానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది.