‘ఆక్వా, పౌల్ట్రీ లకు అత్యధికంగా రుణాలు’..SBI కార్పొరేట్ జనరల్ శ్రీనివాస్ వెల్లడి

by Jakkula Mamatha |
‘ఆక్వా, పౌల్ట్రీ లకు అత్యధికంగా రుణాలు’..SBI కార్పొరేట్ జనరల్ శ్రీనివాస్ వెల్లడి
X

దిశ, ఏలూరు:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆక్వా, అగ్రికల్చర్, పౌల్ట్రీ, రైస్ మిల్లులకు అత్యధికంగా రుణాలు అందిస్తున్నామని బ్యాంక్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏ.డి.శ్రీనివాస్ తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఏలూరు బ్యాంక్ మేనేజర్ మహీధర్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ వినియోగంపై, క్రెడిట్ క్యాంపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏ.డి. శ్రీనివాస్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ధారా సింగ్ నాయక్, రీజినల్ మేనేజర్ పి.సతీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏ.డి. శ్రీనివాస్ మాట్లాడుతూ తమ బ్యాంక్ 21 డిసెంబర్ 1911న మెహతా ఛైర్మన్‌గా స్థాపించిన నాటినుండి దినదినాభివృదిగా చెందుతూ దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందింది అన్నారు. విదేశీ మారక ద్రవ్య మార్జిన్ నుండి పొందిన లాభాలను నుంచి, వ్యాపారులకు రుణం అందించడంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంటోందన్నారు .

వినియోగదారుల కోసం బ్యాంక్ నుంచి ఆక్వా, అగ్రికల్చర్, పోల్ట్రీ, రైస్ మిల్ లకు అత్యధికంగా రుణాలు అందించడంలో ముందున్నామన్నారు. చిరువ్యాపారులకు జిఎస్‌టి ఆధారంగా రుణాలు అందిస్తున్నామన్నారు. రీజనల్ మేనేజర్ పి.సతీష్ బాబు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 574 జిల్లా ప్రధాన కార్యాలయాలను కవర్ చేసే పాన్-ఇండియా ఉనికిని కలిగిందన్నారు. త్వరలోనే మరో 25 శాఖలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి శాఖ నుంచి 4.5 కోట్ల టర్నోవర్ ప్రస్తుతం జరుగుతుందన్నారు. దానిని మరింత పెంచేందుకు బ్యాంక్ వినియోగదారులకు రుణాల అవగాహనా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ మహీధర్ బ్యాంకులో పొదుపులు, రుణ సౌకర్యం, బ్యాంకు ద్వారా నిర్వహిస్తున్న బీమా, పెన్షన్, ఇతర సౌకర్యాలు. ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి వినియోగంలో జాగ్రత్తలను బ్యాంక్ ఖాతాదారులకు వివరించారు . ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు, ఖాతాదారుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed