చెప్పుతో చెంపలు వాయించుకున్న సర్పంచ్.. ఎందుకో తెలుసా?

by srinivas |   ( Updated:2023-04-10 12:42:28.0  )
చెప్పుతో చెంపలు వాయించుకున్న సర్పంచ్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ఏపీ సర్పంచుల సంఘం సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఓ సర్పంచ్ తీరు ఒక్కసారిగా కలకలం రేపింది. సర్పంచులందరితో వేదికపై కూర్చున్న సర్పంచ్ రమేశ్ తన కాలి చెప్పును తీసి చెంపలపై కొట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చినాంపల్లె‌కు కొన్నాళ్లుగా పంచాయతీ నిధులు రావడంలేదు. దీంతో సర్పంచ్ రమేశ్ చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ నిధులు విడుదలకాకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, పదవి ఉన్నా గ్రామం అభివృద్ధి చెందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. మిగిలిన సర్పంచులు కూడా నిధులు రావడంలేదని వాపోయారు. ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి పంచాయతీ నిధులను విడుదల చేయాలని కోరారు.

Advertisement

Next Story