- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Suresh: నిధులు నేనిస్తా... నీళ్ళివ్వండి
దిశ,ఎర్రగొండపాలెం: ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితులు ఉన్నచోట తాను సొంత నిధులు ఇస్తానని, నీళ్లు ఇచ్చే బాధ్యత అధికారులు చూడాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మార్కాపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యర్రగొండపాలెం మండలంలో భూగర్భ జలాలు అడగంటుంతున్న పరిస్థితిని మంత్రికి అధికారులు వివరించారు. బోర్లు వేస్తే నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్న చోట తక్షణమే బోర్లు వేయాలని సూచించారు. పెద్దదోర్నాల మండలంలో బొమ్మలాపురం, చిన్నదోర్నాలలో మూడు బోర్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పుల్లలచెరువు మండలంలో చెన్నంపల్లి, గంగవరం గ్రామాల్లో బోర్లు వేస్తామని చెప్పారు. దూరంనుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తరలించేందుకు తమ నాయకులు ఏర్పాట్లు చేస్తారని మంత్రి తెలిపారు.
పుల్లలచెరువులో సాగర్ నీళ్లు పైప్ లైన్ ద్వారా ఇస్తామని అధికారులు చెప్పటంతో గ్రామంలో కొళాయిల ఏర్పాటుకు 5 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నామని ఆయన చెప్పారు. త్రిపురాంతకం మండలం దువ్వలి, లేళ్లపల్లి గ్రామాల్లో సమస్య అధికమని అక్కడ ట్యాంకర్లతో సరఫరా చేస్తామన్నారు. యర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి, గుర్రపుశాల పంచాయతీలతో పాటు అన్ని గ్రామాల్లో ట్యాంకర్లతో నీళ్లు తోలెందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో నీళ్ల ట్యాంకర్ల బిల్లులు రాలేదని అందరూ అడుగుతున్నారని మంత్రికి అధికారులు చెప్పారు. ఈ విషయం సీఎం దృష్టిలో ఉందని, ఏప్రిల్ నెలలో బిల్లులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని మంత్రి సురేష్ వివరించారు.