AP News: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

by srinivas |   ( Updated:2023-05-16 06:33:31.0  )
AP News: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళుతుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ప్రమాదంలోరు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story