హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే బాలినేని పిటిషన్.. విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2024-08-19 07:00:23.0  )
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే బాలినేని పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల రీ వెరిఫికేషన్ కొనసాగుతోంది. బాలినేని విజ్ఞప్తితో ఈవీఎంలను ఎన్నికల సంఘం అధికారులు రీ చెక్ చేస్తున్నారు. అయితే రీ చెక్‌పై బాలి‌నేని శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీవీప్యాట్లలోని ఓట్లతో సరిపోల్చాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం వివరణ తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు విచారణ వాయిదా వేసింది.

కాగా ఒంగోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేస్తోంది. గత ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ సరళిపై తనకు అనుమానాల ఉన్నాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల రీవెరిఫికేషన్‌ కోసం ఆయన రూ.5 లక్షల 44వేలు చెల్లించారు. ఈ క్రమంలో సోమవారం భాగ్యనగర్‌లోని ఈవీఎం కేంద్రం వద్ద రీవెరిఫికేషన్‌ కొనసాగుతోంది. మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్‌ కేంద్రాల్లో నేడు మాక్‌ పోలింగ్‌..రీ చెకింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసులు రెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story