- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఘవరెడ్డిని కావాలనే మద్యం కేసులో ఇరికించారు: Mla Balineni
దిశ, వెబ్ డెస్క్: మాగుంట రాఘవరెడ్డిని కావాలనే మద్యం కేసులో ఇరికించారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని బెయిల్‌పై విడుదలైన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఇవాళ ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేనిని కలిశారు. శాలువా కప్పి బాలినేనిని రాఘవరెడ్డి సత్కరించారు. లిక్కర్ కేసులో జరిగిన పరిణామాలను బాలినేనికి రాఘవరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ మాగుంట రాఘవరెడ్డికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేవుడు ఉన్నారని, మాగుంట కుటుంబానికి మంచే జరుగుతుందని మాజీ మంత్రి బాలినేని చెప్పారు.
‘మాగుంట కుటుంబం 50 ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తోంది. కావాలనే తప్పుడు కేసుల్లో వారిని ఇరికించారు. కచ్చితంగా ఆ కేసు పరిష్కారం అవుతుంది. మాగుంట ఫ్యామిలీ నుంచి రాఘవరెడ్డి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నా. రాఘవ రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటాం.’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.