మంత్రి నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు.. గ్రామాల నుంచి వెళ్లిపోతున్న రైతులు

by srinivas |
మంత్రి నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు.. గ్రామాల నుంచి వెళ్లిపోతున్న రైతులు
X

దిశ, ఎర్రగొండపాలెం: నియోజకవర్గంలోని మండలాల్లో తీవ్రమైన కరవు తాండవిస్తుంది. ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు భారీగా వలసలు పోతున్నారు. పంటల పండగ పెట్టుబడికి అప్పులు తెచ్చి భారంగా మారిన వ్యవసాయాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. రైతులు కూడా వలస కూలీలుగా తమ సొంత గ్రామాన్ని, భూములను వదిలి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ప్రాంతాలకు బతుకుదెరువు కోసం భారీగా వలస పోతున్నారు. పత్తి, వరి చెరకు, మట్టి, భవన నిర్మాణం పనుల కోసం వలసలు వెల్లే క్రమంలో ఎన్నోసార్లు ప్రమాదాలకు గురై అనేకమంది వలస కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యవ్వన వయసులో వివాహాలు జరిగి భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఆసరాగా ఉన్న పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, ఇలా వలస కూలీల కుటుంబాల్లో తీవ్రమైన విషాద సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. స్థానికంగా ఉండే నాయకులు అక్రమాస్తులను కూడా పెట్టుకోవడానికి తమ సొంత ప్రయోజనాల కోసమే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, వలస పోతున్న ప్రజల కోసం ఎప్పుడు ఎవరు పట్టించుకున్న పాపాలకు లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed