Breaking: చీరాలలో ఉద్రిక్తత... పరస్పరం కొట్టుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయులు

by srinivas |
Breaking: చీరాలలో ఉద్రిక్తత... పరస్పరం కొట్టుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయులు
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పేరాల కూడలిలో రెండు వర్గాలు బాహాబాహీకి తీగాయి. ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్ సత్యానందంకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి దగ్గర కూడా రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినా ఉద్రిక్తంగానే ఉండటంతో బందోబస్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story