భారీగా పెరిగిన వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Mahesh |
భారీగా పెరిగిన వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణ నదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో కృష్ణపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, టైల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలో ఉన్న కృష్ణ బ్యారేజీకి భారీగా వరద వస్తుంది. దీనికి తోడు విజయవాడలో కురిసిన కుంభ వృష్టి తోడైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కృష్ణ బ్యారేజీకి ఉన్న 70 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి ఎగువ నుంచి 4,06,490 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

కాగా ప్రకాశం బ్యారేజీకి 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు.. సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీరు విడుదల.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల.. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,06,990 క్యూసెక్కులుగా ఉంది. కాగా ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 12.2 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండుకుంది. నుంచి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story