- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే శుభవార్త చెప్పిన సోనాక్షి.. ఆనందంలో ఫ్యాన్స్!
దిశ, సినిమా: నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) హ్యాండ్సమ్ జహీర్ ఇక్బాల్(Zaheer Iqbal)ను ఇటీవల ప్రేమ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మతాలు వేరు కావడంతో ముందుగా పెద్దల ఆమోదం లేదు. కానీ ఆ తర్వాత అందరినీ ఒప్పించి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అటు ముస్లిం ఇటు హిందూ సాంప్రదాయాలు కాకుండా లీగల్‌గా పెళ్లి చేసుకుని బెస్ట్ అనిపించుకున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఈ బాలీవుడ్ బ్యూటీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి.. దీపావళి స్పెషల్‌గా పండుగ పార్టీలో తళుక్కుమని మెరిసింది.
ఈ మేరకు ముంబయిలో జరిగిన దివాళీ బాష్‌లో అనార్కలీ సూట్‌లో భర్తతో కనిపించి మెప్పించింది. అంతేకాకుండా.. తన భర్త, చేతిలో పప్పీ (పెట్ డాగ్)తో క్యూట్ ఫొటోలకు పోజులివ్వడంతో పాటు.. వాటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అలాగే.. ‘గెస్ దిస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. ‘సోనాక్షి తల్లి కాబోతుంది.. ఆమె ప్రెగ్నెంట్.. ఇలా గుడ్ న్యూస్ చెప్పింది.. త్వరలో ఇంకో పర్సన్ రాబోతున్నారు’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు.