జనసేనకు మద్దతు తెలిపిన ప్రభాస్ ఫ్యామిలీ.. బొలిశెట్టి శ్రీనివాస్ రియాక్షన్ ఇదే (పోస్ట్)

by sudharani |   ( Updated:2024-05-13 20:40:06.0  )
జనసేనకు మద్దతు తెలిపిన ప్రభాస్ ఫ్యామిలీ.. బొలిశెట్టి శ్రీనివాస్ రియాక్షన్ ఇదే (పోస్ట్)
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఏపీ ఎన్నికలు చర్చనీయాశంగా మారాయి. పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ప్రజల్లో ఉత్సహాం.. నాయకుల్లో టెన్షన్ మొదలైంది. మరి ముఖ్యంగా ఈసారి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా వారి చొరవ చూపించడంతో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. అయితే గతంతో పోల్చుకుంటే జనసేనా అధినేత పవన్ కల్యాణ్‌కు సెలబ్రెటీల మద్దతు మరింత పెరగిపోతుంది. ఈ క్రమంలోనే బుల్లితెర సెలబ్రెటీల నుంచి స్టార్ హీరోహీరోయిన్ల వరకు తమ మద్దతును పవన్ కల్యాణ్‌కు తెలుపుతూ.. ఇన్‌స్టా, X ఖాతాలో పోస్ట్‌లు పెడుతూ గెలిపించమని కోరుకున్నారు.

ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ సైతం జనసేనకు సపోర్ట్ చేస్తూ ‘పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో మన పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అయిపోయింది. చాలా మంది అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అక్కడ ఘన విజయం సాధిస్తాడు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఎంత మెజారిటీ ఇస్తారో అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజారిటీ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యామిలీ మద్దతుపై తాడేపల్లిగూడెం ఉమ్మడి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘నాకు మద్దతు తెలిపిన ప్రభాస్ గారికి వారి పెద్దమ్మ, కృష్ణంరాజు గారి భార్య శ్యామల దేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు’ అంటూ తన X ఖాతాలో ప్రభాస్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story