- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి
దిశ, శ్రీశైలం ప్రాజెక్టు: నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఏపీ జెన్‌కో అధికారులు ప్రారంభించారు. దిగవన ఉన్న నాగార్జునసాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం అధికారులను కోరిన సాగర్ అధికారులు దీనితో అంగీకరించిన శ్రీశైలం జలాశయం అధికారులు 3 టీఎంసీల వరకు నీటిని గుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్‌కి విడుదల చేసేందుకు అధికారులు అంగీకారం దీనితో శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నేడు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన 4 యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రస్తుతం 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. సుమారు మూడు టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు విడవడానికి సుమారు మూడు రోజుల సమయం పట్టవచ్చని జెన్కో అధికారుల ద్వారా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో : 15,919 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 812.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం: 35.9850 టీఎంసీలు