- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయండి..నిరుద్యోగ జేఏసీ
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న 905 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించాగా 87.17 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎగ్జామ్ అయిపోయిన 45 రోజుల వ్యవధిలోనే ఏపీపీఎస్సీ ఫలితాలను కూడా వెల్లడించింది. ఏప్రిల్ 11వ తేదీన ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్‌కు ప్రిపెర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటంతో సన్నద్ధం కాలేకపోయామన్నారు. కాగా జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొన్న సంగతి తెలిసిందే.