Posani Krishna Murali : నన్ను చంపేందుకు లోకేష్ కుట్ర.. ఇదే నా మరణ వాంగ్మూలం సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-20 05:58:01.0  )
Posani Krishna Murali : నన్ను చంపేందుకు లోకేష్ కుట్ర.. ఇదే నా మరణ వాంగ్మూలం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌పై ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో తనను చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను చచ్చిపోతే లోకేష్‌దే బాధ్యత అని.. ఇదే తన మరణ వాంగ్మూలం అని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కంటే ఎక్కువ క్రెడబులిటీ ఉన్నవాడినని.. జగన్ వ్యక్తిత్వం నచ్చే ఆయన్ని అభిమానిస్తున్నానని తెలిపారు.

లోకేష్ తనపై నాలుగు కోట్ల పరువు నష్టం దావా వేశాడని.. అసలు లోకేష్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. కంతేరులో లోకేష్ భూమి కొన్నాడని అనడం పరువు నష్టం అయ్యిందట అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే.. కనీసం 20 ఏళ్లు జైల్లో ఉంటాడని అన్నారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నాది నిజం కాదా అని ప్రశ్నించారు.

లోకేష్ వాళ్ల అమ్మ, భార్య ఆస్తులు లోకేష్‌వి కావా అని నిలదీశారు. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి టీడీపీలోకి రావాలని ఆహ్వానించాడని తెలిపారు. కాగా, లోకేష్ కంతేరులో భూములు కొన్నాడని పోసాని చేసిన ఆరోపణలపై లోకేష్ పరువు నష్టం దావా వేశాడు. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Akira Nandan ను ఇంట్రడ్యూజ్ చేయనున్న Raghavendra Rao.. క్లారిటీ ఇచ్చిన Renu Desai

Advertisement

Next Story