AP News:‘విలువలతో కూడిన రాజకీయాలు మావి’..మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
AP News:‘విలువలతో కూడిన రాజకీయాలు మావి’..మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ బొత్స సత్యనారయణను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుతో ఓట్లు కొనాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి 600కు పైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఓట్లు కొనాలని కుట్ర పన్నుతున్నారు. కానీ ఓట్లు కొనకుండా వైసీపీ విలువలతో కూడిన రాజకీయం చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story