- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఎంపీ ఎంవీవీ నిర్వాకం.. 11 సెక్షల కింద కేసులు నమోదు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు జీవీ, బ్రహ్మాజీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ భూమిని బలవంతంగా లాకున్నారని జగదేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుపై పోలీసు యంత్రాంగం కదిలింది. తమ భూములు ఎంవీవీ బలవంతంగా లాక్కురని 2021లోనే జగదీశ్వరరావు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాజాగా పోలీసులకు ఆశ్రయించడంతో మాజీ ఎంపీ ఎంవీవీతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులను కొట్టివేయాలని ఎంవీవి సత్యానారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం షాక్ ఇచ్చింది. ఎంవీవీ పిటషన్‌ను కొట్టివేసింది.
వృద్ధాశ్రమం, అనాథ శరణాలు నిర్మిస్తానని జగదీశ్వరుడు అనే వ్యక్తి హయగ్రీవ ప్రాజెకు పేరుతో విశాఖ ఎండాలో 12.51ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి చిలుకూరు జగదీశ్వరుడు లీజుకు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ భూములు ఎంవీవీ ఆధీనంలోకి వెళ్లాయి. అనంతరం హయగ్రీవ భూముల్లో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, భారీ నిర్మాణాలు చేపట్టారని కోర్టులో ఇప్పటికే కేసులు నడుస్తున్నాయి. అయితే ఈ భూములను ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నానని జగదీశ్వరుడు అయిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధాశ్రమం, అనాథశరణాలకు కేటాయించిన భూమిని భయపెట్టి, బలవంతంగా ఎంవీవీ లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా విశాఖలో వృద్ధాశ్రమం, ఆనాథ శరణాలయం నిర్మిస్తానని, అలాగే వారు సౌకర్యంగా నివశించేందుకు కాటేజులు నిర్మిస్తామని చిలూకూరు జగదీశ్వరుడు 2006లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు ఎండాడలో సర్వే నెంబర్ 92/3లో 12.51 ఎకరాల భూమిని ఎకరా 45 లక్షల చొప్పున కేటాయించారు. 10 శాతం భూమిలో వృద్ధాశ్రమం, అనాథ శరణాలు ఉచితంగా నిర్వహించాలనేది షరతు. 60 శాతం భూమిలో వృద్ధులు సౌకర్యంగా నివసించేలా కాటేజులు, మిగిలిన 30 శాతం భూమి మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. కొన్నాళ్ల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో భూములనురెవెన్యూ అధికారులు వెనక్కి తీసుకున్నారు. దీంతో హయగ్రీవ మేనేజింగ్ పార్టనర్ గా ఉన్న జగదీశ్వరుడు కోర్టును ఆశ్రయించారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది. గద్దె బ్రహ్మాజీకి 75 శాతం వాటా ఇస్తూ జగదీశ్వరుడు హయగ్రీవలో మేనేజింగ్ పార్టనర్ గా చేర్చుకున్నారు. ఆ వెంటనే బ్రహ్మాజీ నుంచి భూమిని గన్నమనేనికి జీపీఎస్ చేసినట్లు గుర్తించారు. తన భూమినిజీవీ, ఎంవీవీ చేజిక్కించుకున్నారని, తనకు తెలియకుండా కొన్ని స్థలాలు కూడా అమ్మేశారని 2021, డిసెంబర్‌లో జగదీశ్వరుడు సెల్పీ వీడియోను విడుదల చేశారు.