పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి

by Satheesh |
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఎమ్మెల్యే కారుపై ఆగంతకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఆయన అనచరులు మాత్రమే కారులో ఉన్నారు. ఈ ఘటన జీలుగుమిల్లి మండలంలోని బర్రింకలపాడు దగ్గర చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. క్షేమంగా ఉన్నానని బాలరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే కారుపై దాడికి పాల్పడ్డ నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తు్న్నట్లు తెలిపారు.

Advertisement

Next Story