మీడియాకు PK ఝలక్.. వాళ్లందరికీ లీగల్ నోటీసులు పంపిన జనసేన పార్టీ

by Hamsa |   ( Updated:2023-07-07 09:45:05.0  )
మీడియాకు PK ఝలక్.. వాళ్లందరికీ లీగల్ నోటీసులు పంపిన జనసేన పార్టీ
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై నిత్యం సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తుంటాయి. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవాకు కూడా విడాకులు ఇస్తున్నట్లు పలు రూమర్స్ వచ్చాయి. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. అయినా పలువురు వైసీపీ నేతలు పవన్‌పై తప్పుడు విమర్శలు కూడా చేశారు. తాజాగా, ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొంత మందికి లీగల్ నోటీసులు కూడా పంపినట్లు జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై జనసేన పార్టీ చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది. వీరిలో అధికార ysrcp కి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ చానల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నాము. YCPకి చెందిన కొన్ని అసభ్యకర అకౌంట్ వివరాలు అంటూ పలు చానల్స్ పేర్లను కూడా పోస్ట్‌లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story