- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు తాలిబన్ లాంటి శిష్యుడిని: వర్మ
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుకు తాను తాలిబన్ లాంటి శిష్యుడిని అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం పంచాయితీకి తెరపడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పునాదులపై చంద్రబాబు మెచ్చుకునేలా పవన్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తెలిపారు. తన భవిష్యత్తుపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వస్తే పిఠాపురంలోని సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారని స్పష్టం చేశారు.
కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు ఆయనకు ఇవ్వడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చారు. పవన్ కల్యాణ్ తొలుత భీమవరంలో పోటీ చేస్తారని అనుకున్నామని, కానీ ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతామని చెప్పడంతో ఆ సీటు కేటాయించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని, వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురం పంచాయితీ క్లియర్ అయిందని టీడీపీ, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More..