AP News:ఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్..మొహరించిన పోలీసులు

by Jakkula Mamatha |   ( Updated:2024-06-06 12:06:19.0  )
AP News:ఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్..మొహరించిన పోలీసులు
X

దిశ ప్రతినిధి,నరసరావుపేట:మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలీసులు నిఘా పెట్టారు. ఎస్పీ ఆదేశాలతో ఆయన నరసరావుపేటలో ఇంటి చుట్టూ మఫ్టీలో పహారా కాస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లిని రేపు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉంటున్నారు. కాగా, ఈవీఎం ధ్వంసం, ఇతర కేసుల్లో పిన్నెల్లి పై ఈ నెల 6 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ ఉత్తర్వులపై పాల్వాయి గేటు టీడీపీ ఏజంటు నంబూరి శేషగిరి రావు సుప్రీం కోర్టులో కేసు వేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతన్ని ఓట్ల లెక్కింపు కు అనుమతించ వద్దని ఆదేశాలిచ్చింది, పరిసరాల్లోని రావడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. దాని పై వైసీపీ వర్గాల్లో వణుకు పుట్టింది. ఆయన సుప్రీం ఆదేశాలతో కౌంటింగ్కు వెళ్ళ లేకపోయారు. నరసరావుపేట లోని ఓ ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం జరిగిన లెక్కింపులో జూలకంటి బ్రహ్మ రెడ్డి చేతిలో భారీ మెజారిటీ తేడాతో ఓటమి పాలయ్యారు. హైకోర్టు ఆదేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ముగియనున్నాయి.ఆ వెంటనే ఆయనను పోలీసులు అదుపులో తీసుకొని అరెస్టు చేయనున్నట్లు పల్నాడు పోలీసు వర్గాలు తెలిపాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం దేశం,రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed