పిన్నెల్లి కి షాక్.. రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు

by Mahesh |   ( Updated:2024-06-03 07:35:27.0  )
పిన్నెల్లి కి షాక్.. రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రేపు కౌంటింగ్ సందర్భంగా మాచర్లలో మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉందని.. తనకు పిన్నెల్లితో ప్రాణహాని ఉందని టీడీపీ ఏజెంట్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎం బాక్సును ద్వంసం చేసిన కేసులో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా.. ముందస్తుగా కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు అతన్ని అరెస్టు నుంచి మినహాయించాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story