- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: సుప్రీంకోర్టుకు చేరిన జీవో నెంబర్ 1 రగడ
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీవో -1పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 24న పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది.
రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేధిస్తూ జీవో 1 విడుదల
కాగా రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 1ను విడుదల చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన ఏపీ సీజే బెంచ్ తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. హైకోర్టు తీర్పును వెల్లడించకపోవడంతో మరికొందరు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో -1ను సవాల్ చేస్తూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరగాలని పిటిషనర్లు కోరగా ఈనెల 24న విచారణ జరిపేందుకు సీజేఐ ధర్మాసనం అనుమతించింది.
హైకోర్టు తీర్పు వెల్లడిస్తే సుప్రీంలో పిటిషన్ల ఉపసంహరణకు ఛాన్స్
అయితే ఈ అంశంపై సుమారు మూడు నెలల పాటు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కాగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఈనెల 24లోపు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తే సుప్రీం కోర్టులో ఈ కేసును పిటిషనర్లు ఉపసంహరించుకునే ఛాన్స్ కనిపిస్తోంది.