- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం(Ration rice) స్మగ్లింగ్, అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు.. సంచలనంగా మారాయి. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం బాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ(Jayasudha) గోదాములో దాదాపు 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం అయినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు అతని భారత జయసుధ, కొడుకులకు నోటీసులు జారీ చేశారు. దీంతో అప్రమత్తం అయిన నాని కుటుంబ సభ్యులు తమను అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం.. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన కృష్ణా జిల్లా కోర్టు(Krishna District Court).. జయసుధకు ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది. అలాగే రేషన్ బియ్యం మిస్సింగ్(Ration is missing rice) కేసులో పోలీసుల విచారణ కు తప్పక హాజరు కావాలని.. అలాగే విచారణకు సహకరించాలని.. ఈ సందర్భంగా కోర్టు పేర్ని జయసుధను ఆదేశించింది.