ప్రజల సొమ్ము అప్పనంగా సలహాదారులకు కట్టబెట్టారు: నాదెండ్ల

by Ramesh Goud |   ( Updated:2024-02-03 13:11:53.0  )
ప్రజల సొమ్ము అప్పనంగా సలహాదారులకు కట్టబెట్టారు: నాదెండ్ల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ సలహదారుగా సజ్జల 2.40 లక్షలు జీతం తీసుకున్నారని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం సలహాలు ఇచ్చారని అంత జీతం తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికార వైసీపీపై విమర్శల వర్షం గుప్పించారు. మీ ఉపన్యాసాలు రాయడం కోసమే ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారా అని, సజ్జలకు కేబినెట్ హోదా ఎలా కల్పించారని ప్రశ్నించారు.

అంతేగాక సలహదారులకు రూ.14 వేలు మాత్రమే ఇస్తామని చెప్పారని, మరి 2 లక్షల జీతం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ సలహాదారులకు మంత్రి ప్రోటో కాల్ ఏంటీ, ఖర్చులు ఎంత అని అడిగితే సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో పిచ్చి రాతలు రాశారని మండిపడ్డారు. యువత స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుల కార్యాలయం కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును అప్పనంగా వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.

Read More..

ఆరు గ్యారెంటీల అమలుకు ఇంకా 40 రోజులే సమయం

Advertisement

Next Story

Most Viewed