- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకేశ్, చంద్రబాబుని తిట్టని వాళ్లకి టికెట్లు దక్కవు.. అసంతృప్త ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: లోకేశ్, చంద్రబాబుని తిట్టని వాళ్లకి వైసీపీలో సీట్లు ఉండవని వైసీపీ అసంతృప్త నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో, పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన.. రాజీనామా విషయంపై వివరణ ఇచ్చేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మట్లాడుతూ.. రాజకీయాలు వదిలిపెట్టి వ్యాపారాలు చేసుకుందామని అనుకున్నాను. కానీ, శ్రేయోభిలాషులు, తన అభిమానులు రాజకీయాల్లోనే కొనసాగమని సలహ ఇచ్చారని తెలిపారు.
అలాగే టికెట్ రాకపోవడంపై స్పందిస్తూ.. లోకేశ్, చంద్రబాబులను తిట్టని నిన్నేలా నమ్మాలని జగన్ అడిగారని అన్నారు. తిట్టని వాళ్లకి సీట్లు ఇవ్వనని తెగేసి చెప్పారని జగన్ తీరుపై మండిపడ్డారు. 2019 నన్ను నా గెలుపుకు సపోర్టు చేయని జోగి రమేష్ ను నేను గెలిపించాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వమంటే స్పందించట్లేదని వాపోయారు.
రాజధాని అంశం గురించి తాను జగన్ ను ప్రశ్నించానని, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో 30 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపిస్తే రాజధాని మార్పుపై ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలని, ఈ నిర్ణయం పార్టీకి నష్టం కలిగిస్తుందని తాను, మల్లాది విష్ణు వివరించే ప్రయత్నం చేశామన్నారు. కానీ కొడాలి నాని జగన్ నిర్ణయం ఫైనల్ అని తమని వారించినట్లు తెలిపారు. రాజధాని విషయంపై అంబటి సైతం జగన్ నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించకూడదని హెచ్చరించారని అన్నారు. రాజీనామా పై స్పందిస్తూ.. మనసు గాయపడిన చోట నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేమని చెప్పకనే చెప్పారు.
Read More : నేను రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదు.. ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు