జగనాసుర వధకు జనం సిద్ధం: అచ్చెన్నాయుడు

by Seetharam |
జగనాసుర వధకు జనం సిద్ధం: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సైకోని తరిమికొట్టినపుడే సామాన్యుడి బతుకులు బాగుపడతాయి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దేశమంతా రావణ దహనంతో దసరా చేసుకుంటున్నాయని...మనం జగనాసురుడి పాలనకు అంతం పలికి దసరా చేసుకుందాం అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.‘రాష్ట్రంలోని ఒక్కో మహిషాసుర మర్ధినిగా చెలరేగి జగన్ రెడ్డి అరాచకాలను అంతం చేసేందుకు పంతం పూనారు. జగనాసురుడి పీడ పోవాలని నినదిస్తూ విజయదశమి నాడు శపథం చేద్దాం. సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో రాత్రి 7.00 నుండి 7.05 వరకు రాష్ట్రంలో ప్రతి గడపన నిలబడి శపథం పూనుదాం. జగన్ రెడ్డి అనే దుష్టుడితో జరిగే పోరులో జన బాందవుడు నారా చంద్రబాబుకి తోడుగా నిలిచి గెలిపించుకుందాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed