పూరేటిపల్లి పంచాయతీలో నీటికి కటకట

by Javid Pasha |
పూరేటిపల్లి పంచాయతీలో  నీటికి కటకట
X

దిశ, కందుకూరు: పూరేటిపల్లి పంచాయతీలో రాళ్ళపాడు రిజర్వాయర్ నుంచి కుళాయిలు ద్వారా నీరు సరఫరా చేసేవారు. అయితే గత మూడు రోజులుగా కుళాయిలు ద్వారా నీరు సరఫరా కావడం లేదు. అందుకు కారణం ఏమిటి అని పంచాయతీ వారిని అడిగితే రిజర్వాయర్ దగ్గర మోటార్లు మొరాయించాయని చెప్పారు. ఆ గ్రామం మొత్తానికి ఒకే ఒక బోరు అది కూడా చిల్ల చెట్టు ల పొదల్లో ఉంది. చీకటి పడితే పురుగు పుట్రా ఇబ్బంది. గత నెల క్రితం కుళాయిలు ద్వారా నీరు వస్తున్నప్పుడు కూడా పంచాయితీ వారు ట్యాంకర్ ద్వారా నీరు కొంతమంది కి సరఫరా చేశారు.

ప్రస్తుతం గ్రామంలో అందరికి నీటి సమస్య ఉంది కాబట్టి పంచాయితీ తక్షణమే స్పందించి నీటి సరఫరా చేయాలని పసుపులేటి గోపి స్థానిక పంచాయతీ లో ఉన్న సిబ్బంది ని అడుగుగా ఎప్పటిలోగా మోటార్లు రిపేర్ అవుతాయో తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ కారణంగా ట్యాంకర్ ద్వారా అయినా ప్రజల నీటి కష్టాలను తీర్చాలని స్థానిక జనసైనికులు సదరు అధికారులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మూలగిరి శ్రీనివాస్, అన్నంగి చలపతి, పసుపులేటి గోపి, కొనికి రాజేష్, జి.శివ, డి.సుదీర్. పి.సన్నీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story