- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Elections 2024: రసవత్తరంగా పెద్దాపురం రాజకీయాలు..
దిశ,పెద్దాపురం: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పెద్దాపురం రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. అభ్యర్దులు నువ్వా నేనా అంటూ ప్రచారంలోదూసుకుపోతున్నారు. కూటమి అభ్యర్థిగా నిమ్మకాయల చిన రాజప్ప, వైసీపీ నుంచి దవులూరి దొరబాబులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఇక్కడ ఎవరికి నచ్చిన రీతిలో వారు వ్యూహ రచన చేస్తున్నారు.
దీంతో పెద్దాపురంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గత రెండు పర్యాయాలు రాజప్ప స్థానికంగా శాసన సభ్యులుగా విజయం సాధించారు. అయితే ఆయన ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించి హేట్రిక్ సాదిస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయన టిడిపిలో సీనియర్ లీడర్. అలానే గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సియంగా కూడా పని చేశారు.
ఇక 2014 లో కోనసీమ నుంచి వచ్చి పెద్దాపురంలో విజయం సాదించిన నిమ్మకాయల చినరాజప్ప.. 2019 ఎన్నికల్లో టీడీపీకి వీచిన ఎదురు గాలిలో కూడా విజయం సాదించారు. తాజాగా మరోసారి విజయం సాదించడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం అదికంగా ఉన్నారు. స్థానికుడైన గుణ్ణం చంద్రమౌళి పెద్దాపురం సీటు ఆశించినా టిడిపి అదినేత చంద్రబాబు నో అనడంతో ఆయన ప్రస్తుతం మౌనంగా ఉండిపోయారు.
రాష్ట్ర పార్టీ వ్యవహారాలకే పరిమితమయ్యారు. అంతేగాక సమీప నియోజకవర్గంనకు చెందిన దివంగత బొడ్డు బాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా రాజానగరం సీటు ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా ఫలించకపోవడంతో కమ్మ సామాజికవర్గం కాస్త టీడీపీపై ఆగ్రహంతో ఉన్నా.. రాజప్పకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాల దృష్ట్యా రాజప్పను గెలిపించుకొంటారని పలువురు అబిప్రాయ పడుతున్నారు.
జనసేనకు చెందిన తుమ్మల రామస్వామి పెద్దాపురం సీటు తనకు ఇవ్వాలని పట్టుపట్టారు. పొత్తు వల్ల కుదరకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే రాజప్ప స్వతహాగా కాపు వర్గానికి చెందటంతో ఓట్ల చీలిక పెద్దగా ఉండకపోవచ్చు.
పెద్దాపురం అభ్యర్థిగా వైసీపీ నుండి దొరబాబు రానున్న ఎన్నికల బరిలో ఉన్నారు. దాదాపుగా 40ఏళ్ళ తర్వాత స్థానికుడికి సీటు ఇచ్చారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. దొరబాబు తండ్రి సుబ్బారావు గతంలో పెద్దాపురంలో అనేక పదవులు చేశారు. అదే పరిచయంతో దొరబాబు జనంలోకి దూసుకు పోతున్నారు.
అయితే దొరబాబుకు కాపు, కమ్మ సామాజిక వర్గం ఎంత వరకూ కలిసి వస్తుందనేది ప్రశ్నార్ధకమే అంటున్నారు విశ్లేషకులు. దొరబాబు సంక్షేమ పథకాల మీద అధారపడి ఎన్నికల ప్రచారాన్ని సాగించటం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాలి.