- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly: గంజాయి సాగుపై హోంమంత్రి అనిత హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: గంజాయిని సాగు చేసినా, తరలించినా.. వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి.. తగు శిక్షలు విధిస్తామని హోమంత్రి అనిత హెచ్చరించారు. 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సభా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లు ఎన్ని ఆగడాలకు, అఘాయిత్యాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో.. ఒక్కసారి కూడా జగన్ గంజాయిపై సమీక్ష నిర్వహించలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం అండదండలు చూసుకునే దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై చర్యలు చేపట్టామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నేరస్తుల్ని ఎక్కడికక్కడే అణచివేస్తామన్నారు. రాష్ట్రంలో గంజాయిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏడుసార్లు సమీక్ష నిర్వహించారని తెలిపారు. యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అడిషనల్ డిజిపీ స్థాయి వ్యక్తిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నామని, దీనిపై కేబినెట్ లో ఆమోదం కూడా జరిగిందన్నారు. ప్రజల్లో కూడా సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, బ్లేడ్ బ్యాచ్ నేరస్థులను గుర్తించి ప్రొఫైలింగ్ చేస్తున్నామని వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి సాగుచేసినా, తరలించినా పీడీయాక్ట్ కేసులు నమోదు చేసి.. వారి ఆస్తున్ని జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి అనిత వివరణ అనంతరం.. మంత్రి నారా లోకేష్ సైతం గంజాయి కట్టడిపై సభలో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి కట్టడిపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్ ను కోరారు. ఈ సమావేశాలు, లేదా వచ్చే సమావేశాల్లోనైనా దీనిపై చర్చ నిర్వహించాలని ప్రతిపాదన చేశారు.