Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి శ్రీకారంచుట్టిన జనసేనాని.. నేడు ఆ నియోజకవర్గంలో పర్యటన

by Indraja |   ( Updated:2024-03-30 07:02:10.0  )
Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి శ్రీకారంచుట్టిన జనసేనాని.. నేడు ఆ నియోజకవర్గంలో పర్యటన
X

దిశ వెబ్ డెస్క్: ఓ వైపు సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటుంటే.. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని సైతం వారాహి ఎక్కి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక నేటి నుంచి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో జనసేనాని పర్యటన కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గొల్లప్రోలుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేరుకుంటారు.

అనంతరం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత దత్త పీఠాన్ని దర్శించుకోనున్నారు. దైవ దర్శనానంతరం ఆయన దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో వర్మ నివాసంలో భేటీ కానున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. కాగా పవన్ తాను పిఠాపురం నుండి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన తరువాత తొలిసారి పిఠాపురంకి పవన్ రావడంతో ప్రత్యేకత సంతరించుకుంది.

Read More..

నాలుగో రోజుకు చేరుకున్న బస్సు యాత్ర.. నేడు ఆ నియోజకవర్గంలో జగన్ పర్యటన

Advertisement

Next Story