Pawan: పిఠాపురంలో నేడు పవన్ గృహ ప్రవేశం.. భారీ సంఖ్యలో హాజరుకానున్న నాయకులు

by Shiva |
Pawan: పిఠాపురంలో నేడు పవన్ గృహ ప్రవేశం.. భారీ సంఖ్యలో హాజరుకానున్న నాయకులు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు గృహ ప్రవేశం చేయనున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉగాది పండుగను సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. అక్కడి నుంచి చేబ్రోలు రామాలయానికి వెళ్లి పవన్‌ కల్యాన్ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పిఠాపురం టీడీపీ, జనసేన కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్న పవన్ చేబ్రోలులో నూతన గృహాన్ని నిర్మించారు. ఈ మేరకు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గొల్లప్రోలు వెళ్లి అనంతరం పిఠాపురానికి చేరుకుకోనున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.

Advertisement

Next Story