CM Chandrababu : మాస్టర్స్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ భార్య.. స్పందించిన సీఎం చంద్రబాబు

by Aamani |   ( Updated:2024-07-22 13:33:38.0  )
CM Chandrababu : మాస్టర్స్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ భార్య.. స్పందించిన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదిక అన్నా లెజ్నేవా కి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా తాను సాధించిన ఘనత గొప్పదని, కుటుంబపరమైన పాత్రలను నిర్వర్తిస్తూనే విద్యావేత్తలుగా కొనసాగించాలనుకునే ఆంధ్రప్రదేశ్‌లోని సోదరీమణులకు కుమార్తెలందరికీ ఇది స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడుతుందని ప్రశంసించారు. ఇదిలా ఉండగా అన్నా లెజినోవా కాన్వకేషన్‍ అందుకున్న కార్యక్రమంలో భార్యతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సందడి చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెటింట‌ తెగ వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story