Pawan Kalyan: గద్దర్ పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-06 12:41:09.0  )
Pawan Kalyan: గద్దర్ పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ వర్థంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతికినన్ని రోజులు పీడిత వర్గాల గొంతుకగా గద్దర్ నిలిచారని కొనియాడారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్ తన గానంతో ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో.. ‘‘పొడుస్తున్న పొద్దు మీద.. అమ్మా తెలంగాణమా’’ వంటి విప్లవాత్మక పాటలు ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిల్చాయి. పేదల రాజ్యమే అంతిమ లక్ష్యంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. పీడిత ప్రజల గొంతుకగా నిలిచి పాటకు పోరాటం నేర్పిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న చనిపోయి నేటితో ఏడాది అవుతుంది అంటే నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story