- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగన్ ఇది కలియుగం’.. సీఎం వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: జగన్ మహాభారతంలో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారు.. మమల్ని కౌరవులతో పోల్చుతున్నారు.. కానీ ఇది కలియుగం కౌరవులు, పాండవులతో పోల్చుకోవద్దని సీఎంకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలశౌరికి కండువా కప్పి పవన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్ తనను అర్జునుడిలా పోల్చుకుంటున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని.. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవడం సిగ్గు చేటని అన్నారు.
సొంత చెల్లిలికి గౌరవం ఇవ్వని వాడు.. ప్రజలకు రెస్పెక్ట్ ఇస్తాడా అని ప్రశ్నించారు. జగన్ మాట్లాడితే సిద్ధం.. సిద్ధం అంటున్నారని.. ఎన్నికలకు మేం కూడా సిద్ధంగానే ఉన్నామని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అన్నింటికీ బదులు చెల్లించాల్సిన టైమ్ వస్తుందని హెచ్చరించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తునమనేది కాదని.. గెలిచే సీట్లలో పోటీ చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి బలంగా అసెంబ్లీలోకి అడుగు పెడతామని.. 2024లో ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.
Read More..
Breaking: జనసేనలో చేరిన వైసీపీ ఎంపీ బాలశౌరి.. అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు