నమ్ముకున్నవారిని ఒమ్ము చేయడమే పవన్ కల్యాణ్ సిద్ధాంతం

by Seetharam |
నమ్ముకున్నవారిని ఒమ్ము చేయడమే పవన్ కల్యాణ్ సిద్ధాంతం
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ చేసిన ప్రజా సంకల్పయాత్రతో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వైసీపీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. పేద ప్రజలకు వైఎస్ జగన్ ఒక మంచి సైనికుడిలా పనిచేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రతి పేదవాడి గోడును విన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదని చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికే జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. పవన్ కల్యాణ్ ఏనాడూ ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించలేదని చెప్పుకొచ్చారు. కానీ జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారని చెప్పుకొచ్చారు. తనను నమ్ముకున్న వారిని ఒమ్ము చేయడమే పవన్ కల్యాణ్ సిద్ధాంతం అని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకి భజన పరుడిగా మారారు అని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ వల్ల ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో మాదిరిగా ఏపీలో కూడా రాబోయే రోజుల్లో టీడీపీ జెండా పీకేయడం కన్ఫర్మ్ అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గ గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story